Skip to main content

యాక్సిస్ బ్యాంక్‌లో కొత్తగా గిగ్-ఎ-ఆపర్చునిటీస్విధానం.. త్వరలో 1000నియామకాలు

న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో కంపెనీలు ఖర్చులను తగ్గించేందుకు కొత్త విధానాలను అవలంబిస్తున్నాయి.
వర్కింగ్ స్ట్రక్చర్‌తో పాటు ఉద్యోగ నియామకాల్లోనూ నూతన పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఈ కొత్త పోకడల్లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ ‘‘గిగ్-ఎ-ఆపర్చునిటీస్’’ విధానానికి తెర తీసింది. ఈ విధానం ద్వారా బ్యాంకు 1000 మంది కొత్త ఉద్యోగుల నియామకానికి సిద్ధమైంది. ఈ గిగ్ విధానంతో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు బ్యాంక్ నియమాలకు అనుగుణంగా దేశంలో ఎక్కడి నుంచైనా పనిచేసే సౌకర్యం ఉంటుందని బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ‘‘గిగ్-ఎ-ఆపర్చునిటీస్’’ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నైపుణ్యం కలిగిన యువతీ, యువకులు, అపార అనుభవం కలిగిన మధ్యస్థాయి నిపుణుల, మంచి ప్రతిభావంతుల సేవలను పొందేందుకు బ్యాంక్ చూస్తుందని యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజేష్ దహియా పీటీఐతో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు కూడా ఈ గిగ్ వర్కింగ్‌కే ఆసక్తి చూపుతున్నారని, ఈ పద్ధతితో అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులతో తక్కువ సమయంలో నాణ్యమైన పనిని పొందవచ్చన్నారు. మొదటి బ్యాచ్ అక్టోబర్ 1లేదా 2 తేదీల్లో ప్రారంభంకావచ్చన్నారు. వచ్చే ఏడాదిలోనూ 800-1000 మందిని ఈ విధానం ద్వారానే రిక్రూట్ చేసుకుంటామని దహియా చెప్పారు. ఇంతకు పూర్వం పనికోసం ఆఫీసుకు రావాల్సి వచ్చేది. అయితే కరోనా తెచ్చిన ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్’’ సమూల మార్పులు తెచ్చింది. మొదట్లో వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఉద్యోగులు కొంత సంశయించారు. అయితే ఇప్పుడు వారు అలవాటు పడ్డారు. ఈ విధానంతో అధిక ఉత్పాదకత, అత్యంత సమర్థవంతమైన పని జరగుతున్నట్లు రుజువైంది.
Published date : 21 Aug 2020 02:25PM

Photo Stories