Skip to main content

వర్సిటీల్లో పరిశోధనలకు ప్రత్యేక బోర్డు : ఉన్నత విద్యా మండలి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన పరిశోధనలకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఇకపై ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తీర్మానించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి అధ్యక్షతన ఉన్నత విద్యామండలి సర్వసభ్య సమావేశం మార్చి 6 (శుక్రవారం)నజరిగింది. ఉన్నత విద్యారంగం అభివృద్ధి, ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పోటీ ప్రపంచంలో యువతను సర్వసన్నద్ధం చేయడం, అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన సంస్కరణలు తదితర అంశాలపై చర్చించారు.

పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
  • యూనివర్సిటీలో పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక బోర్డు ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయిలో ఒకే పరీక్ష నిర్వహించాలని తీర్మానించారు.
  • ఏపీ ఉన్నత విద్యా మండలితోపాటు, యూనివర్సిటీల చట్టాల్లో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. కొత్త సవాళ్లకు దీటుగా కొత్త చట్టాన్ని పటిష్టంగా రూపొందించాలని యోచిస్తున్నారు.
  • రాష్ట్రంలో 1991లో తీసుకొచ్చిన యూనివర్సిటీ చట్టంలో మార్పులు చేసి అన్ని వర్సిటీలకు కలిపి ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.
  • రాష్ట్రంలో కొత్త కళాశాలలకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే దానిపై సర్వే చేయాలని భావిస్తున్నారు.
  • యూనివర్సిటీల్లో సిబ్బందిలో నైపుణ్యాల పెంపుదల, బాధ్యతాయుత పరివర్తన కోసం ఏయే అంశాలపై శిక్షణ ఇవ్వాలనే అంశంపై చర్చించారు.
Published date : 07 Mar 2020 03:29PM

Photo Stories