వీరి సేవలు చిరస్మరణీయం: సబితా ఇంద్రా రెడ్డి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు మరవలేమని కొనియాడారు. ప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి డిజిటల్, ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం అని ఆమె పేర్కొన్నారు.
Published date : 05 Sep 2020 08:11PM