వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏలకు జాబ్ చార్ట్: ఏపీ వ్యవసాయ శాఖ
Sakshi Education
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో రైతులకు సేవలందించేందుకు నియమించిన గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏలు), గ్రామ ఉద్యాన సహాయకులు (వీహెచ్‌ఏలు), గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుల (వీఎస్‌ఏలు) జాబ్ చార్ట్‌కు, పని సంతృప్తి నివేదికలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ రాసిన లేఖను ఆమోదిస్తూ వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేరిట బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జాబ్ చార్ట్, పని సంతృప్తి నివేదికలను సంబంధిత మండల వ్యవసాయాధికారి ఆమోదించి, సంతకం చేసి, ఆయా గ్రామ సచివాలయాలకు పంపాలి. గ్రామ సచివాలయ కార్యదర్శి కూడా వారి పని తీరును మదింపు చేసి, జీతాలు చెల్లించేలా ఏర్పాటు చేశారు. దీనివల్ల వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏల పనితీరు మెరుగు పడడమే కాకుండా రైతులకు సక్రమంగా సేవలందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 8,741 మంది వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏలను నియమించిన సంగతి తెలిసిందే.
జాబ్ చార్ట్...
జాబ్ చార్ట్...
- ఉదయం 8 నుంచి 12 గంటల వరకు: పొలానికి వెళ్లి రైతులతో మాట్లాడడం
- ఉదయం 12 నుంచి మధ్యాహ్నం 1 వరకు: రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) నిర్వహణ చూడడం, రైతు సమస్యలను తెలుసుకోవడం, ఫిర్యాదులు స్వీకరించడం
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు: ఉత్తర ప్రత్యుత్తరాలు, సేవలు అందించడం
- మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు: గ్రామ విజ్ఞాన కేంద్రాల నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తుల దుకాణాల నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తుల గిరాకీ మదింపు
Published date : 12 Mar 2020 02:44PM