వీఆర్‌ఏలకు జేఏలుగా పదోన్నతులపై టీఎస్ సర్కార్ పరిశీలన
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వీఆర్‌ఏలకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), జూనియర్ అసిస్టెంట్ ఒకే హోదా కలిగిన పోస్టు కావడంతో వీఆర్‌ఏలకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యం లో చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల అంశాన్ని తేల్చాలని కోరు తూ ఇటీవల రాష్ట్ర డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్‌ఏ సంఘం అధ్యక్షుడు వింజ మూరి ఈశ్వర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన ఈ అంశంపై చర్య లు తీసుకోవాలని భూ పరిపాలన శాఖ అధికారులను ఆదేశించారు.
Published date : 31 Jan 2020 02:48PM