విద్యాశాఖ పరిధిలోకి అంగన్‌వాడీ కేంద్రాలు : ఆదిమూలపు సురేష్
Sakshi Education
యర్రగొండపాలెం: అంగన్‌వాడీ కేంద్రాలను విద్యా శాఖ పరిధిలోకి తీసుకురావడంపై ప్రభుత్వం యోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు.
నర్సరీ చిన్నారులను ఎల్‌కేజీ, యూకేజీలుగా విభజించి విద్యను అభ్యసించేలా చేయటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఫిబ్రవరి 3న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు మంచి పౌష్టికాహారం అందించడమేగాక వారు విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్న ప్రధానోద్దేశంతో ఈ ఆలోచన చేశామని, దీని సాధ్యాసాధ్యాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలిస్తున్నారని చెప్పారు.
Published date : 04 Feb 2020 04:23PM