విద్యార్థుల్లో 0.25%, టీచర్లలో 0.59% కోవిడ్ పాజిటివ్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లు తెరిచిన నాటినుంచి ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షల్లో విద్యార్థుల్లో 0.25 శాతం మందికి, ఉపాధ్యాయుల్లో 0.59 శాతం మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
పాజిటివ్ నిర్ధారణ అయిన చిన్నారులు, ఉపాధ్యాయులకు తక్షణం వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 5,18,973 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 1,206 మందికి, 77,048 మంది ఉపాధ్యాయుల్లో 412 మందికి పాజిటివ్‌గా తేలింది. సగటున రోజుకు 4,500 మంది విద్యార్థులకు, 2,200 మంది టీచర్లకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా కరోనా నిర్ధారణ అయిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య
జిల్లా | విద్యార్థులు | ఉపాధ్యాయులు |
అనంతపురం | 60 | 19 |
చిత్తూరు | 136 | 21 |
తూ.గోదావరి | 194 | 27 |
గుంటూరు | 211 | 100 |
కృష్ణా | 88 | 20 |
కర్నూలు | 49 | 11 |
ప్రకాశం | 125 | 23 |
నెల్లూరు | 46 | 10 |
శ్రీకాకుళం | 58 | 28 |
విశాఖపట్నం | 73 | 52 |
విజయనగరం | 10 | 07 |
ప.గోదావరి | 76 | 17 |
కడప | 80 | 77 |
మొత్తం | 1,206 | 412 |
Published date : 30 Dec 2020 03:07PM