Skip to main content

విద్యార్థులకు సహాయపడేందుకు ఏఐ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష ఉచితంగా...

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఇంటి వద్దనే ఉండి పరీక్షలకు సిద్ధమవుతున్న ఐఐటీ/జెఈఈ, నీట్ విద్యార్థులకు తమ సన్నద్ధతను అంచనా వేసుకోవడానికి సహాయపడే కృత్రిమ మేథస్సు ఆధారిత ఆన్‌లైన్ వేదిక. తమ కలలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేస్తున్న విద్యార్థులకు సహాయపడేందుకు అనుకూల అభ్యాస సాంకేతికతను మిళితం చేసుకున్న కృత్రిమ మేథస్సు (ఏఐ) ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష. ఏఐ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షను ఏప్రిల్ 29న తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్ ప్రారంభించారు.
పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు అనుకరణ వాతావరణంలో పరీక్షలకు హాజరయ్యేందుకు వేదికను ఇది అందిస్తుంది. ఈ పరీక్షలను నిపుణులు సృష్టించారు. ఈ పరీక్షలు అభ్యాసకులు ఆయా అంశాలపై తమ విషయ పరిజ్ఞానం, సన్నాహాకతను పరీక్షించుకునేందుకు తోడ్పడతాయి. ఈ వేదిక సమయపాలన, బలం, వేగం, ఖచ్చితత్త్వం, ప్రేరణ, టాపిక్ స్ట్రెంగ్త్, ఎలిమినేషన్ సహా ఏఐ ఆధారిత ఎనలిటిక్స్‌ను ఉపయోగిస్తుంది.

కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు పలు రంగాలు పనిచేయకుండా అడ్డుకోవడం కారణంగా పలు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆందోళనలను తగ్గించేందుకు లెర్నింగ్ ట్రీ ఇప్పుడు ప్రిపరేషన్ , ప్రాక్టీస్, పరీక్ష ఇవాల్యుయేషన్ సమస్యలను పరిష్కరించేందుకు ఏకీకృత పరిష్కారం అందిస్తుంది. అలాగే ఈ సిమ్యులేషన్ పరీక్ష కోసం ఒక్కో విద్యార్థి 500 రూపాయల చందా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్-19 లాక్‌డౌన్ కాలంలో www.LearningTree.AI  వద్ద నమోదు చేసుకున్న విద్యార్థులకు పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.

శ్రీ శశికాంత్ వల్లెపల్లి (లెర్నింగ్ ట్రీ నెక్ట్స్‌జెన్, సీఈఓ) మాట్లాడుతూ..
తరువాత తరం వేదిక లెర్నింగ్ ట్రీ. ఇది విద్యార్థులకు సంపూర్ణమైన అభ్యాస అనుభవాలను అందించనుంది. లెర్నింగ్ ట్రీ ఎలాంటి క్లిష్టత లేకుండా లీనమయ్యే అభ్యాస సాంకేతికతను అనుకూల అభ్యాసంతో ఎలాంటి క్లిష్టత లేకుండా మిళితం చేయడంతో పాటుగా విద్యార్థులకు అత్యుత్తమ అనుసంధానిత అనుభవాలను అందిస్తుంది. లెర్నింగ్ ట్రీ డాట్ ఏఐ ద్వారా విద్యార్థులు ఐఐటీ/జెఈఈ, నీట్, ఎన్‌టీఎస్ఈ కోసం మాక్ టెస్ట్‌లను తీసుకోవడం ద్వారా తామెంతగా పరీక్షలకు సిద్ధమైనదీ పరీక్షించుకోవచ్చు. ఈ మాక్ పరీక్షలను మొత్తం పోటీ పరీక్షల సిలబస్‌ను కవర్ చేసే రీతిలో తీర్చిదిద్దారు. ఇది విద్యార్థులకు సమయపాలన, కాన్సెప్ట్యువల్‌గా సంసిద్ధం కావాల్సిన ఆవశ్యకత తెలుసుకునేందుకు దోహదపడుతుంది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా అతి కీలకమైన పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అందువల్ల, మేము విద్యార్థులను నమోదుచేసుకోవడంతో పాటుగా ఉచిత చందా ప్రయోజనాలు పొందవలసినదిగా.. తమ మేథస్సును పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ మాక్‌టెస్ట్‌లు www.LearningTree.AI  వద్ద లభ్యమవుతాయి...'' అని అన్నారు.

ప్రీమియర్ ఇనిస్టిట్యూట్‌లు అయినటు వంటి రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయ (ఆర్‌జీపీవీ) యూనివర్శిటీ, యశ్వంత్‌రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీ (వైసీఎంఓయు) ఈ లెర్నింగ్ ట్రీ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నాయి.

లెర్నింగ్ ట్రీ గురించి..
ఏఐ సాంకేతికతను వినియోగించి వైవిధ్యమైన అభ్యాస ఉత్పత్తులను లెర్నింగ్ ట్రీ అందిస్తుంది. అనుకరణ వాతావరణంలో ఔత్సాహికులు పరీక్షలకు సిద్దం కావడంతో పాటుగా పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని ఈ ఆన్‌లైన్ టెస్ట్స్ అందిస్తాయి. ఈ పరీక్షలను నిష్ణాతులు సృష్టించారు. అభ్యాసకులకు ఆయా బోధనాంశాల పట్ల విషయపరిజ్ఞానంతో పాటుగా వారి సంసిద్ధతను సైతం పరీక్షిస్తుంది. అదనంగా, అగుమెంటెడ్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతల ఆధారంగా సమాచారం అందిస్తూనే, పలు ఇతర అంశాలు అయినటువంటి వేగం, గమనం, బలం, సమయం మరియు సవివరమైన రీతిలో అంశాల వారీగా విస్తృత స్థాయి నివేదికలనూ అందిస్తుంది. ఈ ఉత్పత్తులను సిరీస్‌గా సృష్టించడం వల్ల పలు పరీక్షలు, విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావడంలో సహాయపడతాయి. లెర్నింగ్ ట్రీ ప్లాట్‌ఫామ్‌ను పాఠశాలలు/యూనివర్శిటీలు అంతర్జాతీయంగా ఆన్‌లైన్ పరీక్షలు, ఆన్‌లైన్ తరగతులు, ఈ-లెర్నింగ్ మరియు మైక్రో క్రెడెన్షియల్స్ కోసం వినియోగిస్తున్నాయి. యుఎస్ఏలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు మరియు స్కూల్స్ అయినటువంటి అరిజోనా స్టేట్ యూనివర్శిటీ, రోడ్ ఐల్యాండ్ స్టేట్, నార్త్ డకోటా, జార్జియా వంటివి లెర్నింగ్ ట్రీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటున్నాయి.
Published date : 29 Apr 2020 06:44PM

Photo Stories