Skip to main content

విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఎలా అందిస్తారు?: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేయంతో అందులో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఎలా అందిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఈ మేరకు కోర్టు పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్చి 18 (బుధవారం)న నోటీసులు జారీ చేసింది. కరోనా కారణంగా చాలా స్కూళ్లు మూతపడటంతో కోర్టు సుమోటోగా కేసును స్వీకరించి విచారించింది. కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా ఢిల్లీతోపాటు అనేక రాష్ట్రాల్లోని పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి.
Published date : 19 Mar 2020 03:13PM

Photo Stories