Skip to main content

విద్యార్థులకు చదువే వ్యసనంగా మారాలి!

విద్యార్థులకు చదువు ఒక వ్యసనంగా మారాలి. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డబ్బు వెచ్చించి దేనినైనా కొనుగోలు చేయొచ్చుగాని కాలాన్ని మాత్రం కొనలేం.
గడచిన క్షణం నీది కాదు. వచ్చే క్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ఆడుకునేందుకు కొంత సమయాన్ని కేటాయించినా ఎక్కువ సమయాన్ని పుస్తకాల వద్దనే గడపాలి. అప్పుడే విద్యార్థులు చదువులో రాణించగలుగుతారు. వాస్తవానికి విద్యార్థులు బడికి ఎందుకు వెళతారు. చదువుకోవడానికే కదా. కాబట్టి దృష్టంతా చదువుపైనే ఉండాలి. మీది చదువకునే వయసు. కాబట్టి ఈ వయసులో చదువు తప్ప మరి ఏ ఇతర విషయాలనూ పట్టించుకోకూడదు. చదువు ద్వారాజ్ఞానం పెంచుకోవాలి. అలా పెంచుకుంటేనే చదువులో మిగతా అందరికంటే ముందుండగలుగుతాం. మరి అందరికంటే ముందుండాలంటే ఏమిచేయాలి. అన్ని విషయాలను గుర్తుంచుకోగలగాలి. ఏ విషయాన్ని నేర్చుకోవాలంటే ఆ విషయంపైనే దృష్టి సారించాలి. అయితే పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు తీవ్ర ప్రభావం చూపుతుంటాయి నాలుక ప్రమాదకరమైనది. చూసిందల్లా తిందామంటుంది. అలా చూసినదల్లా తినడానికి అలవాటుపడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అనారోగ్యానికి గురైతే చదవగలుగుతామా. చదవలేము కదా. అలాగే కళ్లు ప్రతి దానిని చూద్దామంటాయి అలా ప్రతిదానిని చూస్తూ ఉంటే మనం చదువుపై దృష్టిపెట్టలేం. నాలుకకు రుచి ప్రమాదకరం. కంటికి ఆకర్షణ ప్రమాదకరం. వీటికి బానిసలైతే ఎవరైనా చెడిపోవడం అనివార్యం. అందరి మెదళ్లూ ఒకేలా ఉంటాయి తెలివికలిగినవాడికి ఒక రకం మెదడు, తెలివితక్కువ వాడికి మరొకరకం మెదడు ఉండదు. అయితే దానిని ఎలా వినియోగించుకుంటామనే దానిపై మన జీవితం ఆధారపడి ఉంటుందనే విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి.
Published date : 21 Jan 2020 01:52PM

Photo Stories