విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా?: టీఎస్ హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లేని కాలేజీలు ఉన్నాయని, వాటిల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారంటూ ఇంటర్ బోర్డు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తీరు చూస్తుంటే గుర్తింపు లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్న సంస్థల పక్షాన ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఆ కాలేజీలతో చేతులు కలిపినట్లు, కుమ్మకై ్కనట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థుల జీవితాలతో ఆటాడుకున్నట్లేనని ఆందోళన వ్యక్తం చేసింది. గుర్తింపు లేని కాలేజీలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఇంటర్ బోర్డుతోపాటు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు అనుమతుల్లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్నాయని, సెలవుల్లోనూ కాలేజీలను నడుపుతున్నాయని, వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరుతూ ఉప్పల్‌కు చెందిన రాజేష్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కనీసం 20 వేల మంది విద్యార్థులు గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతున్నారని, వాళ్ల జీవితాలతో ఆడుకునే అవకాశం ఇంటర్ బోర్డు కల్పించినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. విద్యాసంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తే రూ.10 లక్షలు చొప్పున విద్యార్థులకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కాలేజీలకు గుర్తింపు దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌బోర్డు చెప్పడంపై ధర్మాసనం స్పందిస్తూ.. హత్య చేసిన వ్యక్తి ఇక ముందు హత్యలు చేయబోనని లిఖితపూర్వకంగా హామీ ఇస్తే హంతకుడ్ని వదిలేస్తామన్నట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్య చేసింది.
జరిమానాలు విధించి వదిలేస్తారా?
ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదిస్తూ, అఫిలియేషన్ లేకుండా కాలేజీలు నిర్వహిస్తున్న వివిధ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే 46, 49 చొప్పున కాలేజీలకు అనుమతి ఇచ్చామని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు. కాగా, మార్చిలో వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో చట్ట ప్రకారం అనుమతులు పొందాలని ఆయా కాలేజీలకు నోటీసులిచ్చినట్లు తెలిపారు. అలాగే అనుమతులు లేని వాటికి భారీగా జరిమానాలు విధించామని తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, తాను అమెరికాలో చదివితే ఢిల్లీ యూనివర్సిటీ ప్రవేశం కోసం చేసుకున్న దరఖాస్తును ఆ వర్సిటీ తోసిపుచ్చిందని గుర్తుచేశారు. పలు విద్యాసంస్థలు చట్టాన్ని ఉల్లంఘించి గుర్తింపు లేకుండానే కాలేజీలను నిర్వహిస్తుంటే జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటే ఎలాగని ధర్మాసనం ప్రశ్నించింది. గుర్తింపులేని కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంటర్ బోర్డు అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
జరిమానాలు వసూలు చేశాం..
హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇంటర్ బోర్డు కార్యదర్శి కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. అందులోని వివరాలు.. ‘అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీలు లేకుండా ఉన్న భవనాల్లో నారాయణ 28, శ్రీచైతన్య 18 చొప్పున కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఇంటర్ బోర్డు అనుమతి లేకుండానే వాటిలో కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో నారాయణ 4, శ్రీచైతన్య 2 కాలేజీలు ఉన్నాయి. ఒక్కో కాలేజీకి లక్ష రూపాయలు చొప్పున పెనాల్టీ వసూలు చేశాం. ఆ తర్వాతే వాటిని వేరే చోటకు తరలించేందుకు అనుమతి ఇచ్చాం. సెలవుల్లో కూడా ఆ కాలేజీలు తరగతులు నిర్వహించడంతో రోజుకు రూ.50 వేలు చొప్పున జరిమానా విధించాం. రూ.17 లక్షలు నారాయణ, రూ.10 లక్షలు శ్రీచైతన్యలకు జరిమానాగా వసూలు చేశాం. 15 అడుగుల ఎత్తుకుపైగా ఉన్న భవనాల్లో ఆ కాలేజీలను నిర్వహిస్తున్నారు. ఆయా భవనాలకు ఎన్‌వోసీ ఇవ్వరాదని ఇంటర్ బోర్డు అగ్నిమాపక శాఖను కోరింది. అయితే విద్యా సంవత్సరం ముగుస్తున్నందున పలు షరతులతో ఈ ఏడాదికి మాత్రమే అనుమతి ఇచ్చాం. నారాయణ, శ్రీచైతన్యలకు 52 హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్‌పై హైకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. హైకోర్టు ఆదేశాలిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ రెండు సంస్థలు ఎంసెట్, నీట్, జేఈఈ, ఐఐటీ వంటి అకాడమీలు నిర్వహిస్తోంది. అయితే ఈ అంశంపై ఇంటర్ బోర్డులో ఏ విధమైన రూల్స్ లేవు. ఈ అంశాలను బోర్డు రూల్స్‌లో చేర్చుతాం. ఇప్పటికే నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై ఇంటర్ బోర్డు తనిఖీలు ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నారాయణ 79, శ్రీచైతన్య 71 కాలేజీల్లో తనిఖీలు చేశాం. మిగిలిన కాలేజీల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తాం’అని కౌంటర్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Published date : 18 Feb 2020 03:12PM