విద్యార్థిగా మారిన మహబూబాబాద్ జిల్లాకలెక్టర్
Sakshi Education
బయ్యారం: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ కాసేపు విద్యార్థిగా మారారు.
బయ్యారం మండలంలోని పలు కార్యాలయాలను మార్చి 13న ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసే క్రమంలో కలెక్టర్ అరగంట పాటు విద్యార్థిగా మారారు. తొమ్మిదో తరగతి గదికి వచ్చిన ఆయన విద్యార్థులతో పాటు కలసి కూర్చున్నారు. ఓ టీచర్ బోధిస్తున్న గణితం పాఠాలు విన్న ఆయన.. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు.
Published date : 14 Mar 2020 05:02PM