విద్యార్ధులు సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలి!
Sakshi Education
సంక్రాంతి పండుగ సమయం దగ్గరకు వస్తోంది. ఈ నెల పదో తేదీ నుంచి 16వ తేదీదాకా ప్రభు త్వ పాఠశాలలకు విద్యా శాఖ ఇప్పటికే సెలవులు ప్రకటించింది.
ఇందులో రోజుకు కనీసం 12 గంటల పాటుపిల్లలు మేలుకునే ఉంటారు. ఇందులో అత్యధిక సమయాన్ని ఆటలకే కేటాయిస్తారు. మిగతా 12 గంటలు నిద్రపోతారు. మరి పిల్లల విలువైన సమయం ఆటలకే సరిపోతే చదువుకునేదెప్పుడు. పిల్లలు ఈ సెలవులను సద్వినియోగం చేసుకోవాలి. రెండు నెలల్లో వార్షిక పరీక్షలు మొదలవుతాయి. ప్రతి క్షణమూ విలువైనదే. పదో తరగతి పిల్లలు రెండు లేదా మూడుగంటలపాటు ఆడుకున్నా మిగతా సమయా న్ని చదువుకు కేటా యించాలి. పదో తరగతి జీవితానికి కీలక మలుపు.ఈపరీక్షల్లో వచ్చే మార్కులు లేదా జీపీయే విద్యార్థుల భావి జీవిత భవనానికి పునాది. పునాది బలంగా ఉంటే ఎన్ని అంతస్తు లైనా నిర్మించుకోవచ్చు. అయితే అదే సరిగా లేకపోతే జీవితం పేకమేడగా మారిపోతుంది.ఇక కొంతమంది పిల్లలు పట్టణాలకు వెళ్లి చదువుకుంటుంటారు. సెలవులు రాగా నే ఇంటికెళ్లిపోతారు. అక్కడే సెల వులను గడిపేస్తారు. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా కొలిచే సంస్కృతి మనది. అటువంటి ప్రత్యక్ష దైవాలకు ఈతరం విద్యార్థుల్లో ఎంతమంది పాదనమస్కారం చేస్తున్నారు. ఈ సద్గుణాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలి.
Published date : 07 Jan 2020 01:27PM