Skip to main content

విద్యా దీవెన, వసతి దీవెన దరఖాస్తు గడువు మార్చి 28 వరకు పొడిగింపు

సాక్షి, అమరావతి: జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఉపకారవేతనాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే గడువును మార్చి 28 వరకు పొడిగించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఉపకారవేతనాలకు దరఖాస్తు గడువు మార్చి 25వ తేదీతో ముగిసింది. అయితే, కొన్ని కాలేజీలు, విద్యార్థుల నుంచి విన్నపాలు వస్తుండడంతో గడువును మార్చి 28 వరకు పొడిగించినట్లు వివరించింది.
Published date : 27 Mar 2021 02:55PM

Photo Stories