విదేశీ డిగ్రీలనూ అర్హతగా చేర్చాలి...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదుకు అర్హతగా విదేశీ విశ్వవిద్యాలయాల డిగ్రీలనూ అనుమతించాలని, అలాగే ఓట్ల నమోదుకు మరింత గడువు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది.
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. పట్టభద్ర ఓటర్ల నమోదుకు విధించిన విద్యార్హతలు సవరించాలంటూ అమెరికాలోని పెన్సిల్వేనియాలో చదువుకున్న, నగరానికి చెందిన ఆదిరాజ్ పార్థసారథి దాఖలు పిల్ దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘‘తెలంగాణ విద్యార్థులు విదేశాల్లో చదువుకున్నారు. అయితే ఆ డిగ్రీలకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ వర్సిటీ డిగ్రీలనూ ఓటర్ల నమోదుకు అర్హతగా అనుమతించాలి. ఓటర్ల నమోదు గడువును కూడా పొడిగించాలి’’అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు.
Published date : 02 Jan 2021 04:50PM