వెబ్‌సైట్‌లో టీసీసీ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుహాల్‌టికెట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలను జనవరి 27 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌టికెట్లను తమ వెబ్‌సైట్‌లో (www.bse.telangana.gov.in) అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జనవరి 10వ తేదీ నుంచి అభ్యర్థులు తమ ట్రేడ్, పేరు, తండ్రిపేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు తలెత్తితే జిల్లా డీఈవో కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.
Published date : 11 Jan 2020 02:49PM