వచ్చే విద్యా సంవత్సరం నుంచిఆన్‌లైన్ ద్వారానే.. ఏపీ ఇంటర్ అడ్మిషన్లు
Sakshi Education
సాక్షి, అమరావతి/మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
దీనికనుగుణంగా కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో బుధవారం ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘ఇంటర్ విద్యా విధానంలో సంస్కరణలు-సలహాలు’ అంశంపై కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు.
Published date : 20 Feb 2020 02:00PM