వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ లో స్కిల్‌కోర్స్
Sakshi Education
న్యూఢిల్లీ: ఆరో తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రస్తుతమున్న 5 కంపల్సరీ సబ్టెక్టులతో పాటు ఒక స్కిల్ కోర్సును ప్రారంభించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.
2020- 21 విద్యా సంవత్సరం నుంచి దీన్ని ప్రారంభించాలనుకుంటోంది. వృత్తి నైపుణ్యాలను పెంచుకునే దిశగా స్వల్ప కాలిక మోడ్యూల్స్‌గా ఇవి ఉంటాయని, ఏ కోర్సును ఎంచుకోవాలనే చాయిస్ విద్యార్ధులకే ఉంటుందని సీబీఎస్ఈ ట్రైనింగ్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విశ్వజిత్ సాహా తెలిపారు. 6,7,8 తరగతుల్లో వీటిపై అవగాహన పెంచుకున్న విద్యార్ధులకు కెరీర్ అవకాశాలపై స్పష్టత లభిస్తుందన్నారు.
Published date : 08 Apr 2020 03:07PM