వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ కంపెనీలో 2,000 మందికి పైగా నియామకాలు..!
Sakshi Education
న్యూఢిల్లీ: కంటి అద్దాల తయారీ, విక్రయంలో ఉన్న లెన్స్కార్ట్ వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 2,000 మందికిపైగా సిబ్బందిని నియమించుకోనున్నట్టు ప్రకటించింది.
అలాగే సింగపూర్, పశ్చిమ ఆసియా, యూఎస్‌లో మరో 300 మందిని చేర్చుకోనున్నట్టు బుధవారం వెల్లడించింది. టెక్నాలజీ, డేటా సైన్స్, విక్రయాలు, సరఫరా, ఫైనాన్స్, మానవ వనరుల వంటి విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నట్టు తెలిపింది. సంస్థ వృద్ధిలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతా ల్లో నిపుణులైన మానవ వనరులను కొత్తగా చేర్చుకుంటున్నట్టు లెన్స్‌కార్ట్ ఫౌండర్ పీయూష్ బన్సల్ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 5,000 పైచిలుకు సిబ్బంది ఉన్నట్టు చెప్పారు. 2010లో ప్రారంభమైన లెన్స్‌కార్ట్ ఇప్పటికే కేకేఆర్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, ఐఎఫ్‌సీ వంటి సంస్థల నుంచి నిధులను సమీకరించింది.
చదవండి: గత 27 నెలల్లో.. ఆరోగ్య శాఖలో 14 వేల పోస్టులు భర్తీ..!
చదవండి: ఉద్యోగుల కేటాయింపుపై తెలంగాణ మార్గదర్శకాలు ఇవే..
చదవండి: గత 27 నెలల్లో.. ఆరోగ్య శాఖలో 14 వేల పోస్టులు భర్తీ..!
చదవండి: ఉద్యోగుల కేటాయింపుపై తెలంగాణ మార్గదర్శకాలు ఇవే..
Published date : 12 Aug 2021 02:27PM