Skip to main content

వైఎస్సార్ ఏఎఫ్‌యూలో 2021-22 ప్రవేశాలు

వైవీయూ (వైఎస్‌ఆర్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్‌‌ట్స విశ్వవిద్యాలయంలో 2021-22 విద్యాసంవత్సరానికి గానూ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించినట్లు వైస్ చాన్స్ లర్ ఆచార్య డి.విజయ్‌కిశోర్ తెలిపారు.
మంగళవారం రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సి. సురేంద్రనాథ్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో కడప నగరంలో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో 10 డిపార్ట్‌మెంట్లలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలి పారు. ఇందులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కు నాటా, జేఈఈ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశం కోసం ఆప్షన్స్ ఇచ్చేందుకు ఈ నెల 16 వరకు అవకాశం ఉందన్నారు. వీటితో పాటు బీటెక్ టౌన్‌ప్లానింగ్, బీటెక్ డిజిటల్ టెక్నాలజీ, బీటెక్ ఫెసిలిటీస్ అండ్ సర్వీస్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం ఎంసెట్ ద్వారా కల్పించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు బీటెక్ డిజైన్, ఇంటీరియల్ డిజైన్ కోర్సు, కాలేజ్ ఆఫ్ ఫైన్‌ఆర్‌‌ట్సలోని 5 రకాల (అప్‌లైడ్ ఆర్‌‌ట్స, పెయింటింగ్, స్కల్ప్చర్ (శిల్పం), ఫొటోగ్రఫీ, యానిమేషన్) కోర్సుల్లో ప్రవేశం కోసం ఆడ్‌సెట్-2020 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Published date : 16 Dec 2020 03:18PM

Photo Stories