వాయు కాలుష్యంతో చిన్నారుల్లో స్కిజోఫ్రినియా
Sakshi Education
లండన్: తీవ్ర వాయు కాలుష్యం వల్ల చిన్నారుల్లో స్కిజోఫ్రినియా వచ్చే ముప్పు ఉందని తాజా పరిశోధనల్లో తేలింది.
ఆటిజమ్, బై పోలార్ రుగ్మత, కుంగుబాటు వంటి తీవ్ర స్థాయి మానసిక సమస్యలకు మూలాలు, వాటికి చికిత్స మార్గా లను కనుగొనేందుకు ఐపీఎస్‌వైసీహెచ్ పేరిట పరిశోధనను ఇప్పటికే శాస్త్రవేత్తలు చేపట్టారు. ఇందులోని జన్యుడేటాను తాజాగా డెన్మార్క్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. అలాగే ఆ దేశ పర్యా వరణ శాస్త్ర విభాగం నుంచి డేటానూ సేకరించి, విశ్లేషించారు. ఎదిగే క్రమంలో తీవ్రస్థాయి వాయు కాలుష్యానికి గురయ్యే చిన్నారులకు స్కిజోఫ్రినియా ముప్పు ఎక్కువని తేల్చారు. ఇది ఒక వ్యక్తి ఆలోచనలు, భావాలు, వ్యవహారశైలిని ప్రభావితం చేసే తీవ్రస్థాయి మానసిక రుగ్మత. నిత్యం సరాసరి క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాముల స్థాయి వాయుకాలుష్యానికి గురయ్యే పిల్లలతో పోలిస్తే 25 మైక్రో గ్రాముల స్థాయి కాలుష్యాన్ని ఎదుర్కొనే వారిలో స్కిజోఫ్రినియా ముప్పు 60 శాతం మేర ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు.
Published date : 10 Jan 2020 04:49PM