Skip to main content

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ భారీగా పెరిగింది

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ (చేరికలు) పెరిగింది. నాలుగేళ్లలో 11.4 శాతం పెరుగుదల నమోదైంది.
సీనియర్‌ సెకండరీ విద్యను (ఇంటర్మీడియట్‌) పూర్తి చేసుకొని డిగ్రీల్లో చేరే, డిగ్రీలు పూర్తి చేసుకొని పీజీల్లో చేరే 18– 23 మధ్య వయస్సు ఉన్న విద్యార్థుల సంఖ్యలో (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో–జీఈఆర్‌) పెరుగుదల నమోదైంది. దేశంలో జీఈఆర్‌ 2014–15 సంవత్సరంలో 24.3 శాతం ఉండగా 2018–19లో 26.3 శాతానికి, 2019–20 నాటికి 27.1 శాతానికి పెరిగింది. అదే తెలంగాణలో మాత్రం ఈ జీఈఆర్‌ తగ్గిపోయింది. రాష్ట్రంలో 2018–19 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో చేరిన వారి జీఈఆర్‌ 36.2 శాతం ఉంటే 2019–20 విద్యా సంవత్సరంలో జీఈఆర్‌ 35.6 శాతానికి (0.6 శాతం) పడిపోయింది. అయితే పీహెచ్‌డీల్లో చేరిన అభ్యర్థుల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. 2018–19 విద్యా సంవత్సరంతో పోలి్చతే 2019–20 విద్యా సంవత్సరంలో అదనంగా 2 వేల మందికి పైగా అభ్యర్థులు పీహెచ్‌డీలో చేరారు. అలాగే రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో చదివే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2018–19 విద్యా సంవత్సరంలో 2,020 మంది విద్యార్థులు చేరగా, 2019–20 çసంవత్సరంలో 2,261 మంది విదేశీ విద్యార్థులు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐఎస్‌హెచ్‌ఈ) – 2019–20 వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ గురువారం విడుదల చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు కాలేజీలే ఎక్కువ
దేశంలో ఉన్నత విద్యారంగం గత అయిదేళ్లలో (2015–16 నుంచి 2019–20 వరకు) ఏమేరకు ఉన్నత ప్రమాణాలు, వృద్ధి రేటు సాధించిందో గణాంకాలతో సహా నివేదిక విశ్లేషించింది. నివేదిక ప్రకారం.. దేశంలో ఉన్నత విద్యలో మహిళల చేరికలు 18.2 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా అధ్యాపక, విద్యార్థి నిష్పత్తి 2019–20 సంవత్సరంలో 1:26గా ఉంది. దేశవ్యాప్తంగా పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించి 2014–15లో 1.17 లక్షల మంది విద్యార్థులు ఉండగా 2019–20లో 2.03 లక్షల మంది చేరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం ప్రైవేట్‌ కాలేజీలే ఉన్నాయి. తెలంగాణలో డ్యూయల్‌ మోడ్‌ యూనివర్సిటీలు 7 ఉన్నాయి. అందులో రెగ్యులర్‌ డిస్టెన్స్ విధానంలో విద్యా బోధన కొనసాగుతోంది. తెలంగాణలో కేవలం 66 వేల మంది విద్యార్థులు మాత్రమే పాలిటెక్నిక్‌ అభ్యసిస్తున్నారు అందులో 69.8% విద్యార్థులు బాలురే. ఇక తెలంగాణలో నర్సింగ్‌ కోర్సును చదువుతున్న వారిలో 94.5 శాతం బాలికలే ఉన్నారు.
Published date : 11 Jun 2021 12:54PM

Photo Stories