Skip to main content

ఉన్నత విద్యాసంస్థల్లో ‘అడ్వాన్స్‌డ్‌ అటెండెన్స్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అత్యున్నత విద్యాప్రమాణాలను నెలకొల్పేందుకు ‘అడ్వాన్స్‌డ్‌ అటెండెన్స్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విధానాన్ని పకడ్బందీగా, అత్యంత పారదర్శకత, నిబద్ధతతో అమలు చేసేందుకు అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకు టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యా శాఖ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌) సీఈవో పి.రవి సుభాష్, అనంతపురం, కాకినాడ జేఎన్టీయూలు, ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీల ఉపకులపతులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో అడ్వాన్స్‌డ్‌ అటెండెన్స్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను 2020–21 విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ఇందుకు ప్రతిపాదనలను ఆహ్వానించనున్నారు.
Published date : 06 Mar 2021 04:07PM

Photo Stories