‘ఉన్నత’ పరిశోధనలకు స్టేట్ రీసెర్చ్ బోర్డు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉన్నత విద్య పరిశోధనల్లో రాసి, వాసి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిన నేపథ్యంలో స్టేట్ రీసెర్చ్ బోర్డుకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుడుతోంది.
దేశంలో ఒకవైపు ఉన్నత విద్యారంగంలో పరిశోధనల సంఖ్య తగ్గిపోతుండగా మరోపక్క నాణ్యత లోపిస్తోంది. పీహెచ్‌డీ విద్యార్థుల పరిశోధనలు నామమాత్రం కాగా అధ్యాపకులు సాగించే పరిశోధనలు దాదాపు శూన్యమనే చెప్పాలి. వివిధ జర్నళ్లలో ప్రచురితమయ్యే అధ్యాపకుల పరిశోధనా పత్రాలు పేటెంట్ హక్కులను దక్కించుకునే స్థాయిలో లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు పరిశోధనా రంగంలో నూతనాధ్యాయాన్ని ఆవిష్కరించేందుకు ఉన్నత విద్యామండలి కార్యాచరణ ప్రారంభించింది. స్టేట్ రీసెర్చ్ బోర్డు ద్వారా పరిశోధనలను ప్రోత్సహించనున్నారు.
పరిష్కారాలను అన్వేషించేలా..
వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్, స్టార్టప్ సెంటర్లు (ఈఐఎస్‌సీ) ఏర్పాటు చేయడం ద్వారా నూతనావిష్కరణలకు మార్గం సుగమం కానుంది. స్టేట్ రీసెర్చి బోర్డుకు ఏటా రూ.50 కోట్లు కేటాయించనున్నారు. మొక్కుబడి పరిశోధనలతో సరిపెట్టకుండా సామాజిక, ఆర్థిక, సాంకేతిక, పరిపాలనా సంబంధిత సమస్యలకు పరిష్కారాలను కనుగొనేలా పరిశోధనలకు ఊతమివ్వనున్నారు. రీసెర్చ్ డిజిటల్ లైబ్రరీ, సాఫ్ట్‌వేర్ డేటా అనాలసిస్, అధ్యాపకుల రీసెర్చ్ ప్రాజెక్టులకు సహకారం, కీలక అంశాల్లో అంతర్ యూనివర్సిటీల బృందాలతో పరిశోధనలు లాంటి కార్యక్రమాలను స్టేట్ రీసెర్చ్ బోర్డు చేపట్టనుంది.
నిధులు లేక నీరసించి..
దేశంలో 993 వర్సిటీలు, 39,931 కాలేజీలు, 10,725 స్వతంత్ర విద్యాసంస్థలున్నా ఐఐటీలు, ఐఐఎస్‌సీ లాంటి కొన్ని విద్యా సంస్థల నుంచి మాత్రమే నాణ్యమైన పరిశోధనా పత్రాలు వెలువడుతున్నాయి. వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ నివేదిక ప్రకారం ఆ సంస్థ వద్ద 7,250 భారతీయ, 1,193 విదేశీ పేటెంట్ల కోసం ప్రతిపాదనలు నమోదయ్యాయి. వీటిలో అత్యధికం టీసీఎస్, విప్రో లాంటి ప్రైవేట్ సంస్థలవే ఉన్నాయి. వివిధ ఐఐటీలు ప్రతిపాదించినవి పరిమితంగానే ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే నిధుల కేటాయింపు చాలా తక్కువగా ఉండటం కూడా పరిశోధనా రంగంలో వెనుకబాటుకు కారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జీడీపీలో 0.69 శాతం మాత్రమే పరిశోధనలకు కేటాయిస్తుండగా అమెరికాలో 2.8 శాతం, ఇజ్రాయెల్‌లో 4.3 శాతం, దక్షిణ కొరియాలో 4.2 శాతం కేటాయిస్తున్నారు. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని నివేదికలు పేర్కొంటున్నాయి.
దేశవ్యాప్తంగా పీహెచ్‌డీలు చేస్తున్న వారు విభాగాల వారీగా (శాతాల్లో..)

సైన్సు | 30 |
ఇంజనీరింగ్ | 26 |
సోషల్‌సైన్సు | 12 |
మేనేజ్‌మెంటు | 6 |
అగ్రి సెన్సైస్ | 4 |
మెడికల్ సెన్సైస్ | 5 |
ఎడ్యుకేషన్ | 5 |
కామర్స్ | 3 |
ఇండియన్ లాంగ్వేజెస్ | 6 |
ఫారెన్ లాంగ్వేజెస్ | 3 |
Published date : 10 Feb 2021 02:49PM