Skip to main content

ఉద్యోగులకు కంబైన్డ్ బస్ పాస్!

సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైలుతో ప్రయాణాల కోసం కంబైన్డ్ పాస్‌లను ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేయాలి.

ఆర్డినరీ బస్సు చార్జీలో 2/3 వంతుకు మించకుండా వీటి ద్వారా జరిపే ప్రయాణాల వ్యయాన్ని ప్రభుత్వం భరించాలి. మిగిలిన వ్యయాన్ని ఉద్యోగులు భరించాలి’అని చిత్తరంజన్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసు చేసింది. ఇటు ఉద్యోగుల ట్రావెలింగ్ అలవెన్సులు (టీఏ) పెంపు విషయంలో ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేసింది.

మైలేజీ అలవెన్స్ పెంచాలి..
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో సొంత వాహనాలు వినియోగించే వారికి అందించే మైలేజీ అలవెన్సులను పెంచాలని పెట్రోల్‌తో నడిచే కార్లకు కిలోమీటర్‌కు రూ.13 నుంచి రూ.16కు, డీజిల్‌తో నడిచే వాటికి రూ.9 నుంచి రూ.14కు, ద్విచక్ర వాహనాలకు రూ.5 నుంచి రూ.6కు అలవెన్సు పెంచాలని కోరింది. కొత్తగా సవరించి ప్రతిపాదిస్తున్న వేతనాల్లో రూ.54,220-1,33,630 వేతనం అందుకునే అధికారులు సొంత కారు, సవరించిన వేతనం రూ.36,750-1,06,990, ఆపై అందుకునే అధికారులు సొంత ద్విచక్రవాహనం ద్వారా ప్రయాణించడానికి ఈ అలవెన్సులను మంజూరు చేయాలని సూచించింది.

ఇతర సిఫారసులు..

  • గ్రేడ్-1, 2 ఉద్యోగులు ఆర్టీసీ/ప్రైవేటు ఏసీ బస్సుల ద్వారా ప్రయాణించడానికి అనుమ తించాలి. గ్రేడ్-3 ఉద్యోగులు నాన్ ఏసీ బస్సుల చార్జీలు చెల్లించాలి.
  • రూ.42,300-1,15,270 వేతనం అందు కుంటున్న ఉద్యోగులకు ఫస్ట్ క్లాస్‌లోని ఏసీ, చైర్ కార్/ఏసీ, 3 టైర్/ఏసీ, 2 టైర్‌తో పాటు సెకండ్ క్లాస్ రైల్వే ప్రయాణాలకు అనుమతించాలి. రూ.38,890-1,12,510 వేతనం ఉన్న ఉద్యోగులకు సెకండ్ క్లాస్ రైల్వే ప్రయాణాలకు అనుమతించాలి.
  • వేతన సవరణ తర్వాత నెలకు రూ.96,890-1,58,380 వేతనం ఉన్న ఉద్యోగులకు అధికార పర్యటనల కోసం విమాన ప్రయాణ సదుపాయాన్ని కల్పిం చాలి. డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ డెరైక్టర్ స్థాయి అధికారులకు సైతం విమాన ప్రయాణ సదుపాయం కల్పించాలి.
  • ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఉద్యోగులకు మూలవేతనంపై 15 శాతాన్ని ప్రత్యేక అలవెన్సుగా చెల్లించాలి.
  • ప్రజారవాణా/ప్రైవేటు రవాణా సదుపాయం లేని జిల్లా కేంద్రం నుంచి 8 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో పర్యటిం చడానికి అందించే మైలేజీ అలవెన్సులను పెంచాలని సిఫారసు చేసింది. గ్రేడ్-1 ఉద్యోగులకు కి.మీ.కు రూ.7 నుంచి రూ.9, గ్రేడ్-2 ఉద్యోగులకు రూ.6 నుంచి రూ.7.50, గ్రేడ్-3 ఉద్యోగులకు రూ.5 నుంచి రూ.6.5కు పెంచాలి.
  • గ్రేడ్-1 ఉద్యోగులకు రాష్ట్రం లోపల ప్రయా ణాలకు రూ.600, వెలుపల ప్రయాణాలకు రూ.800, గ్రేడ్-2 ఉద్యోగులకు రాష్ట్రం లోపల ప్రయాణాలకు రూ.400, వెలుపల ప్రయాణాలకు రూ.600, గ్రేడ్-3 ఉద్యోగు లకు రాష్ట్రం లోపల ప్రయాణాలకు రూ.300, బయట ప్రయాణాలకు రూ.400 వరకు దినసరి భత్యాలను పెంచాలి.


కోర్టు మాస్టర్లకు ఇలా..

  • కోర్టు మాస్టర్లు, హైకోర్టు జడ్జీల వ్యక్తిగత కార్యదర్శుల కన్వెయన్స్ అలవెన్సును నెలకు రూ.5 వేల వరకు పెంచాలి.
  • మండలం లోపల చేసే ప్రయాణాల కోసం ట్రావెలింగ్ అలవెన్సులను నెలకు రూ. 1,200 నుంచి రూ.1,500కు పెంచాలి. రెవె న్యూ డివిజన్ లోపల జరిపే ప్రయాణాలకు నెలకు రూ.1,500 నుంచి రూ.2 వేలకు పెంచాలి.
Published date : 29 Jan 2021 03:37PM

Photo Stories