ఉద్యోగాలు, పదోన్నతుల్లో 89% మహిళలపై చిన్న చూపు: సర్వే
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: అతివలపై వివక్ష పెరుగుతోంది.. వివిధ రంగాలు, ఉద్యోగ అవకాశాల వృద్ధి, పదోన్నతుల కల్పనలో చిన్న చూపునకు గురవుతున్నారు.
కరోనా మహమ్మారి ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో ఈ ప్రతికూల ప్రభావానికి కారణమైనట్టుగా దేశంలోని మెజారిటీ మహిళలు అభిప్రాయపడుతున్నారు. గతేడాది కాలంగా వివిధ స్థాయిల్లో కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితుల పెను ప్రభావం కారణంగా తమకు తగిన ఉద్యోగ అవకాశాలు లభించకపోగా, అడ్డంకులు ఎదురుకావడం, పనిచేస్తున్న చోట్ల పదోన్నతులు లభించకుండా వివిధ అంశాలు ప్రభావితం చేస్తున్నట్టుగా పది మందిలో 9 మంది (89 శాతం) మహిళలు భావిస్తున్నట్టుగా ‘లింక్‌డ్‌ఇన్ ఆపర్చ్యునిటీ ఇండెక్స్–2021’తాజా నివేదికలో వెల్లడైంది.
మహిళా ఉద్యోగులు ఏమనుకుంటున్నారు..?
దీర్ఘకాలంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి పరిస్థితులు, మహిళలకు ఉద్యోగాలు, ప్రమోషన్ల అవకాశాలు, పురుషులతో పోల్చితే కెరీర్‌లు నెమ్మదించడంపై దేశంలోని మహిళా ఉద్యోగులు ఏమనుకుంటున్నారన్న అంశాలపై ఈ నివేదిక లోతైన పరిశీలన నిర్వహించింది. ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలతో పోల్చితే భారత్‌లో మహిళల ‘కెరీర్ డెవలప్‌మెంట్’పై లింగ పరమైన ప్రభావం అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. మహిళలమనే భావన వల్లే వేతనాల ఇంక్రిమెంట్లు, పదోన్నతుల కల్పన అవకాశాలు తగ్గిపోయినట్టు ప్రతీ ఐదుగురిలో నలుగురు మహిళా ఉద్యోగులు (దాదాపు 85 శాతం) ఈ సర్వేలో స్పష్టం చేశారు. అదే ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల్లో మాత్రం లింగ ప్రభావం 60 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక తెలిపింది.
కుటుంబ బాధ్యతల బరువు..
కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, వివిధ రూపాల్లో అందించే సేవల కారణంగా ప్రతీ 10 మందిలో ఏడుగురు మహిళలు తమ కెరీర్‌లో ముందడుగు వేయలేకపోతున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. తమ ఉద్యోగాలు లేదా నిర్వర్తిస్తున్న విధుల్లో పైస్థాయికి ఎదిగే క్రమంలో కుటుంబ బాధ్యతల నిర్వహణ భారం పెరిగిన కారణంగా ఉద్యోగాల్లో ఉన్నత అవకాశాలు లేదా ఆయా హోదాలను అందుకోలేకపోతున్నట్టు 71 శాతం మహిళా ఉద్యోగులు, 77 శాతం వర్కింగ్ మదర్స్ అభిప్రాయపడ్డారు. కుటుంబపరమైన బాధ్యతల నిర్వహణ, వివిధ సమయాల్లో అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకుని పని ప్రదేశాల్లో, ఉద్యోగాల్లో లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్టు 69 శాతం వర్కింగ్ మదర్స్, 63 శాతం మహిళా ఉద్యోగులు వెల్లడించారు. జాబ్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల విషయంలోనూ పురుషులతో పోల్చితే తమకు తక్కువ అవకాశాలు లభిస్తున్నట్టు 37 శాతం దేశంలోని మహిళా ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఆయా ఉద్యోగాల్లో పురుషులతో పోల్చితే తక్కు వ జీతాలు, ప్రోత్సాహాకాలు అందుతున్నట్టుగా 37 శాతం మహిళలు పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు లింగ వివక్ష కొంత మేర తగ్గిందనే అభిప్రాయాన్ని కొందరు పురుషులు, స్త్రీలు వ్యక్తం చేశారు.
ఇవే ప్రధానం..
ఇక ఉన్నత, మంచి ఉద్యోగ అవకాశాలను కోరుకోవడంలో భాగంగా ఉద్యోగ భద్రత, తాము ఇష్టపడే, ప్రేమించే పని–ఉద్యోగ బాధ్యతలు, పని–జీవితం మధ్య తగిన సమతూకం వంటి అంశాలను అటు పురుషులు, ఇటు మహిళలు కోరుకుంటున్నారు. అయినప్పటికీ జీవితంలో పైకి ఎదగడంలో లేదా ఉన్నత అవకాశాలను పొందడంలో ‘జెండర్’ అనేది కీలకంగా మారడంతో పురుషుల పట్ల సంస్థలు మొగ్గు చూపుతున్నట్టు 63 శాతం మహిళలు అభిప్రాయపడుతున్నారు. కాగా తమ యాజమాన్యాలు తమను పురుషులతో సమానంగా చూస్తూ, సమాన అవకాశాలను కల్పించాలని మెజారిటీ మహిళలు కోరుకుంటున్నారు. వివిధ కంపెనీలు, ఉద్యోగ సంస్థలు మహిళల మనోభావాలకు అనుగుణంగా, వారికి తగిన గుర్తింపును అందించే దిశలో మరింత మెరుగైన విధానాలను రూపొందించుకోవాలని లింక్‌డ్ ఇన్ ట్యాలెంట్, లెర్నింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ రుచీ అనంద్ సూచిస్తున్నారు.

Published date : 03 Mar 2021 05:47PM