ఉద్యోగ అర్హతల్లో మహిళలదే అగ్రస్థానం: సర్వే రిపోర్టు
Sakshi Education
సాక్షి, అమరావతి: దేశంలో మహిళల్లో ఉద్యోగ అర్హత అంతకంతకూ పెరుగుతోంది. పురుషుల్లో కంటే మహిళల్లో ఉద్యోగ అర్హత పెరుగుతోందని వీబాక్స్ నేషనల్ టాలెంట్ సర్వే వెల్లడించింది.
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), కాన్ఫెడరేష¯Œన్ ఆఫ్ ఇండియ¯Œన్ ఇండస్ట్రీ (సీఐఐ), యునైటెడ్ నేష¯Œ్స డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎ¯Œన్డీపీ)ల సౌజన్యంతో ఆ సంస్థ ఏటా జాతీయ ఉద్యోగ అర్హత సర్వే నిర్వహిస్తోంది. ఆ సంస్థ ఇటీవల 2021 సంవత్సర సర్వే నివేదికను విడుదల చేసింది. 15 రంగాల్లోని పరిశ్రమలకు చెందిన 150కి పైగా కంపెనీల్లో ఈ సర్వే నిర్వహించారు.
ఆ సర్వేలోని ప్రధాన అంశాలు..
- దేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో పురుషులు 64 శాతం మంది ఉండగా మహిళలు 36 శాతం మంది ఉన్నారు.
- మూడేళ్లుగా దేశంలో ఉద్యోగ అర్హత ఉన్న మహిళల శాతం పెరుగుతూ వస్తోంది. తొలిసారిగా 2021లో ఉద్యోగ అర్హత ఉన్న పురుషుల శాతం కంటే మహిళల శాతం ఎక్కువగా ఉందని వెల్లడైంది.
- వీబాక్స్ సర్వే నివేదిక ప్రకారం దేశంలో 46.80 శాతం మంది మహిళలకు ఉద్యోగ అర్హత ఉంది. పురుషుల్లో 45.91 శాతం మందికే ఉద్యోగ అర్హతఉంది.
- అన్ని రంగాల కంటే మహిళలు బ్యాంకింగ్, ఆర్థికసేవల రంగాల్లో ఎక్కువ ఉద్యోగ అర్హత ధిస్తున్నారు. ఆ రంగంలో మహిళల ఉద్యోగ అర్హత 46 శాతం.
- పురుషులు, మహిళలు కలిపి చూస్తే దేశంలో 45.9 శాతం యువతకు ఉద్యోగ అర్హత ఉంది.
Published date : 24 Feb 2021 12:21PM