ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగాలు కూడా.. వివరాలివిగో..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారి పి.ప్రణయ్ మంగళవారం తెలిపారు.
‘ఇండస్ట్రీ కస్టమైజ్డ్ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్’ కార్యక్రమం ద్వారా కొండపల్లిలో ఉన్న ఫార్మా సెక్టార్‌లో సుప్రసిద్ధమైన అర్చ్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం కల్పించేందుకు వీలుగా రెండు వారాల పాటు ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 30 ఏళ్ల లోపు వారే దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కల్గిన వారుడిసెంబర్13వ తేదీలోగా http://apssdc.in/industryplacements లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వివరాలకు 18004252422, 8501896034, 6305004318 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చని పి.ప్రణయ్ తెలిపారు.
Published date : 09 Dec 2020 02:50PM