Skip to main content

ఉచిత శిక్షణకు ఫిబ్రవరి15లోగా దరఖాస్తు చేసుకోండి: బీసీ స్టడీ సర్కిల్

సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీలో గురుకుల ఉపాధ్యాయుల పోటీ పరీక్ష ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 15లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేసుకునే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు కుటుంబ వార్షికాదాయం రూ.1.5 లక్షలు, పట్టణ అభ్యర్థులకు రూ.2 లక్షలు ఉండాలని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు సంబంధిత జిల్లాలోని హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ ఉంటుందని తెలిపారు. వివరాలకు 040-24071178, 6302427521 నంబర్లలో, studycircle.cgg.gov.in ను సందర్శించాలని సూచించారు.
Published date : 13 Feb 2020 01:25PM

Photo Stories