TS schools reopen: ప్రత్యక్ష బోధన ఆపండి.. విద్యార్థులకు ఇంకా టీకాలివ్వలేదు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలంటూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహితవ్యాజ్యం (పిల్) దాఖలైంది.
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అధ్యాపకుడు ఎం.బాలకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇటీవల కేంద్రానికి ఇచి్చన నివేదిక ప్రకారం కరోనా మూడో దశలో చిన్నారులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. విద్యార్థులకు టీకాలు ఇవ్వలేదు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తుండటం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే. ప్రత్యక్షబోధనను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయం డి. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేయండి’’అని పిటిషన్‌లో కోరారు. ఈ పిల్‌లో విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాలవిద్య, ప్రజారోగ్యవిభాగం డైరెక్టర్లతోపాటు కరోనా అంశాలకు సంబం«ధించి సలహాలిచి్చన నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యు లతో కూడిన నిపుణుల కమిటీ ప్రతినిధి బృందాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
Published date : 30 Aug 2021 03:34PM