త్వరలోనే వర్చువల్ యూనివర్సిటీలు: పొఖ్రియాల్
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: వర్చువల్ యూనివర్సిటీలను స్థాపించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.
నూతన జాతీయ విద్యావిధా నాని(ఎన్‌ఈపీ)కి అనుగుణంగా ఉన్నత విద్యలో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తిని మరింత పెంచేలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఓపెన్ యూనివర్సిటీలకు భిన్నంగా వర్చువల్ యూనివర్సిటీలను స్థాపిస్తామన్నారు. ఎన్‌ఈపీ-2020 అమలుపై విద్యాశాఖ ఉన్నతాధికా రులతో మంత్రి శుక్రవారం సమావేశమయ్యారు. విద్యా విధానం అమలు సరిగ్గా జరిగేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖల్లోనూ నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. ఉన్నత విద్యలో విద్యావిధానం అమలు కోసం గుర్తించిన మొత్తం 181 పనుల కోసం ప్రత్యేకంగా టీం లీడర్లు పనిచేస్తారని ఆయన తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం (ఎన్‌ఈటీఎఫ్)ను యూజీసీ/ ఏఐసీటీఈలో విలీనం చేసి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఉన్నత విద్యలో మాతృభాషల్లో అధ్యయనాలు చేసేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కోరారు. మరోవైపు స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమానికి అవసరమైన ప్రచారాన్ని విసృ్తతంగా చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
Published date : 30 Jan 2021 02:53PM