ట్విట్టర్ వేదికగా గళం విప్పిన విద్యార్థులు
Sakshi Education
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో జేఈఈ, నీట్ నిర్వహణపై విద్యార్థులు గళమెత్తారు.
ట్విట్టర్ వేదికగా వ్యతిరేకతను వెల్లడించారు. ‘స్పీకప్‌ఫర్ స్టూడెంట్స్ సేఫ్టీ’ హ్యాష్‌టాగ్ ఆగస్టు 28వ తేదీ ఉదయం నుంచి ట్విటర్‌లో ట్రెండింగ్ అయింది. ఈ అంశంపై ఏకంగా 22.5 లక్షల పోస్టులు పెట్టారు. కోవిడ్ వేగంగా విస్తరిస్తున్న వేళ పరీక్షలకు ఎలా హాజరు కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేసులు తక్కువగా ఉన్నపుడేమో దేశమంతా లాక్‌డౌన్ పెట్టారు... ఇప్పుడేమో రోజుకు 75 వేల కేసులు వస్తుంటే విద్యార్థులపై బలవంతంగా పరీక్షలు రుద్దుతున్నారు’ అని ఒకరు ట్వీట్ చేశారు.
Published date : 29 Aug 2020 03:49PM