తల్లిదండ్రుల సహకారంతోనే ఫీజుల నియంత్రణ
Sakshi Education
తిరుపతి ఎడ్యుకేషన్: తల్లిదండ్రులు సహకరిస్తేనే అధిక ఫీజుల నియంత్రణ సాధ్యమని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, డాక్టర్ బి.ఈశ్వరయ్య తెలిపారు.
తిరుపతిలోని నారాయణ, ఎన్నారై జూనియర్ కాలేజీలను బుధవారం ఇంటర్ విద్య ఆర్జేడీ ఎం.విశ్వనాథనాయక్, ఆర్‌ఐవో శ్రీనివాసులరెడ్డితో కలిసి వారు ఆకస్మిక తనిఖీ చేశారు. ఫీజులు, వసతుల గురించి విద్యార్థులను ఆరా తీశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో డే స్కాలర్లలో ఒక్కో విద్యార్థికి రూ.లక్ష నుంచి రూ.1.30 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. అవసరం లేని బుక్స్, మెటీరియల్స్‌ను కూడా అంటగడుతున్నట్లు తెలిసిందన్నారు. వీటిపై తల్లిదండ్రులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. అధిక ఫీజుల గురించి 9150381111 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Published date : 28 Jan 2021 02:56PM