టీజీయూజీసెట్– 2021 దరఖాస్తు గడువు మార్చి 15 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్–21 దరఖాస్తు గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగించారు.
ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షను ఏప్రిల్ 24న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివరాలకు గురుకుల సొసైటీ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
Published date : 06 Mar 2021 04:21PM