టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నవీన్ చంద్ ?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీస్‌పీఎస్సీ) చైర్మన్ పోస్టుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రిటైర్డ్ ఐజీ నవీన్ చంద్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ ఐజీగా ఆయన ఇటీవలే పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నవీన్ చంద్‌ను రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా సీఎంఓ కోరినట్టు సోమవారం ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు అల్లుడు అయిన ఆయనకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవిని కట్టబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్న టీఎస్‌పీఎస్సీ సభ్యుడు విఠల్ పేరును సైతం ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 17తో ప్రస్తుత చైర్మన్ ఘంటా చక్రపాణి, మరో ముగ్గురు సభ్యుల 6 ఏళ్ల పదవీ కాలం ముగియనుంది. ఆలోగా ప్రభుత్వం కొత్త చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
Published date : 15 Dec 2020 03:09PM