Skip to main content

టీఎస్ మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం త్వరలో నిర్వహించనున్న మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను జిల్లా కేంద్రాల్లో కాకుండా సమీపంలోని మోడల్ స్కూళ్లు, వాటికి సమీపంలోని గురుకులాలు, జిల్లా పరిషత్ పాఠశాలల్లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఈవోలకు మోడల్ స్కూల్స్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి ఆదేశాలు జారీచేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు 15-20 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయడం ఇబ్బందికరమన్నారు. విద్యార్థుల దరఖాస్తుల ఆధారంగా సమీప స్కూళ్లలో పరీక్ష కేంద్రాలను కేటాయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Published date : 25 May 2020 05:26PM

Photo Stories