Skip to main content

టీఎస్ బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్లలో గందరగోళం

సాక్షి, హైదరాబాద్ : మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో వివిధ తరగతుల్లో ఖాళీల భర్తీకి తలపెట్టిన ప్రవేశ పరీక్ష విద్యార్థులను గందరగోళానికి గురిచేస్తోంది.
బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 257 పాఠశాలలున్నాయి. ఈ స్కూళ్లలో 6,7,8, తరగతుల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఈనెల 15న ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఈ ఫలితాల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. ఈ నేపథ్యంలో పరీక్షకు చెందిన హాల్‌టిక్కెట్లు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. వీటిని డౌన్‌లోడ్ చేసుకున్న విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని చూసుకునేందుకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు.హాల్ టిక్కెట్‌లో పేర్కొన్న చిరునామాలో సదరు పరీక్ష కేంద్రం లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

చిరునామా అరకొర...
బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నిర్వహించిన ప్రవేశపరీక్షకు సంబంధించిన పరీక్షా కేంద్రాలన్నీ బీసీ గురుకుల పాఠశాలలే. వాటికి శాశ్వత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. చాలా పాఠశాలలను మూతపడ్డ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో కొనసాగిస్తున్నారు. కొన్నింటిని దూరప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి చిరునామా ఉంటే తప్ప వాటిని గుర్తించే స్థితి లేదు. అయితే హాల్ టిక్కెట్లను అరకొర చిరునామాతో జారీ చేశారు.
Published date : 16 Mar 2020 05:37PM

Photo Stories