Skip to main content

టీచర్లందరికీ నేటి నుంచి ఒంటి పూట బడులు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు ఈ నెల 7నుంచి ఒంటి పూట బడులను నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
వేసవి ఎండలు పెరిగిన నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే టీచర్లు స్కూళ్లలో విధులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం పాఠశాల విద్యా డైరెక్టర్‌ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో అవి అమలయ్యేలా చూడాలని ఆర్జేడీలను, డీఈవోలను ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత నెలలోనే విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేసేందుకు టీచర్లు మాత్రం పాఠశాలల్లో అందుబాటులో ఉండేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో టీచర్లంతా ప్రస్తుతం బడులకు వస్తున్నారు. ప్రస్తుతం వేసవి ఎండలు తీవ్రం కావడంతో ఒంటిపూట బడులను నిర్వహించాలని మంగళవారం పీఆర్‌టీయూ–టీఎస్‌ తదితర ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరాయి. సంఘాలతో జరిగిన సమావేశంలో ఒంటిపూట బడుల నిర్వహణకు మంత్రి ఓకే చెప్పారు. దీంతో పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Published date : 07 Apr 2021 05:31PM

Photo Stories