Skip to main content

టెట్‌ నోటిఫికేషన్‌ మేలో విడుదల..జూలైలో పరీక్షలు..సిలబస్‌ ఇదే

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ నోటిఫికేషన్‌ను మేలో విడుదల చేసి జూలైలో పరీక్షలు నిర్వహించే అవకాశముంది. అలాగే ఈ సారి టెట్‌ సిలబస్‌ కింది విధంగా ఉంటుంది...

ఏపీ టెట్ మోడల్‌ పేపర్స్‌ కోసం క్లిక్‌ చేయండి

150 ప్రశ్నలు.. 2.30 గంటల సమయం :
▶ టెట్‌ను 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహించనున్నారు. పరీక్ష సమయం 2.30 గంటలు.
▶ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ పెడగాగి, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌), మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సబ్జెక్టుల్లో ప్రతిదానిలో 30 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. వీటికి 30 మార్కుల చొప్పున ఉంటాయి.
▶ పేపర్‌–1ఏలో స్కూళ్లలో ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఉండే తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, తమిళం, ఒడియాలలో అభ్యర్థి ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. అభ్యర్థి ఆ భాషను 1–10 వరకు ఒక సబ్జెక్టుగా అభ్యసించి ఉండాలి. లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌) అభ్యర్థులందరికీ తప్పనిసరి.
▶ పేపర్‌–1బీలో కూడా ఇదేవిధమైన ప్రశ్నలు, ఆప్షన్లు ఉంటాయి. పేపర్‌–2ఏలో చైల్డ్‌ డెవలప్‌మెంట్, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌–2 (ఇంగ్లిష్‌)లలో 30 ప్రశ్నలు చొప్పున 30 మార్కులకు ఉంటాయి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, కన్నడం, ఒడియా, తమిళం, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి 60 మార్కులకు 60 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌–2బీలో చైల్డ్‌ డెవలప్‌మెంట్, లాంగ్వేజ్‌–1, లాంగ్వేజ్‌ –2 ఇంగ్లిష్‌తోపాటు డిజేబిలిటీ స్పెషలైజేషన్‌ అంశాలుంటాయి.

Published date : 18 Mar 2021 02:05PM

Photo Stories