తెలుసా... ఈ ఏడాది వేతనాలు పెరగనున్నాయ్!
Sakshi Education
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీల్లో ఉద్యోగులకు ఈ ఏడాది సగటు వేతన పెంపు 7.3 శాతం ఉండొచ్చని డెలాయిట్ నివేదిక తెలిపింది.
అంచనాలను మించి ఆర్థిక పునరుద్ధరణ, వ్యాపారాలు తిరిగి పుంజుకోవడం, వినియోగదార్ల విశ్వాసం ఇందుకు కారణమని వివరించింది. ఏడు రంగాలు, 25 ఉప రంగాలకు చెందిన 400 సంస్థలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. 2020లో సగటు వేతన పెంపు 4.4 శాతముంటే, 2019లో ఇది 8.6 శాతముందని వెల్లడించింది. జీతాలు పెంచే యోచనలో ఉన్నట్టు సర్వేలో పాలుపంచుకున్న 92 శాతం కంపెనీలు తెలిపాయి. గతేడాది 60 శాతం కంపెనీలే వేతన పెంపునకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. 2021లో రెండంకెల స్థాయిలో జీతాలు పెంపునకు 20 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నాయి. గతేడాది ఇంక్రిమెంట్ ఇవ్వలేకపోయిన కొన్ని కంపెనీలు ఈ ఏడాది అధికంగా వేతనాలను పెంచడం లేదా బోనస్ అందించాలని యోచిస్తున్నాయి. లైఫ్ సెన్సైస్, ఐటీ రంగ కంపెనీలు అధిక ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది.
Published date : 19 Feb 2021 03:23PM