‘తెలుగు వర్సిటీ’ ఫలితాల విడుదల
Sakshi Education
నాంపల్లి (హైదరాబాద్): పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, దూరవిద్యా కేంద్రం ద్వారా 2020, డిసెంబర్‌లో నిర్వహించిన పలు కోర్సుల వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ రిజిస్ర్టార్ ఆచార్య భట్టు రమేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దూరవిద్యా కేంద్రం ద్వారా నిర్వహించిన ఎంఏలో తెలుగు, కమ్యూనికేషన్ జర్నలిజం, సంస్కృతం, జ్యోతిషం, టూరిజం మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ కోర్సులు, బీఏలో స్పెషల్ తెలుగు, కర్ణాటక సంగీతం, పీజీ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం, జ్యోతిర్వాస్తు, డిప్లొమాలో లలిత సంగీతం, జ్యోతిషం, సినిమా రచనా, సర్టిఫికెట్‌లో మోడర్న్ తెలుగు, జ్యోతిషం, సంగీత విశారదలో మొదటి, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులైన వారి వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.
Published date : 25 Mar 2021 04:36PM