తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలి: గవర్నర్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ప్రతిభ కలిగిన తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు.
కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బి.కరుణాకర్‌రెడ్డి బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. పలువురు తెలంగాణ విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఎంబీబీఎస్ ప్రవేశాల తీరును గవర్నర్ ఆయనను అడిగి తెలుసుకున్నారు.
Published date : 31 Dec 2020 01:36PM