‘టైమ్స్’ ర్యాంకింగ్స్ లో ఏపీలో ఎస్వీయూ నంబర్ వన్!
Sakshi Education
క్యాంపస్(తిరుపతి)/ఏఎన్‌యూ (గుంటూరు): ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ బుధవారం విడుదల చేసిన వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నంబర్‌వన్‌గా నిలిచింది.
ఆ సంస్థ 2021 సంవత్సరానికి ప్రపంచ ర్యాంకింగ్‌సలో 801-1000 మధ్య ర్యాంక్ పొంది రాష్ట్రంలో నంబర్‌వన్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. 1001 ప్లస్‌లో స్థానం పొంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రాష్ట్రంలో రెండో ర్యాంక్, జాతీయ స్థాయిలో 34వ ర్యాంక్ సాధించింది. 93 దేశాలకు చెందిన 1,527 వర్సిటీలు ఈ ర్యాంకింగ్‌సలో పోటీపడ్డాయి. సంప్రదాయ వర్సిటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఉస్మానియా వర్సిటీ మాత్రమే ముందుండగా, ఆంధ్రా వర్సిటీ (విశాఖ), జేఎన్‌టీయూఏ(అనంతపురం) 1000 ప్లస్ ర్యాంకులు పొందాయి.
Published date : 03 Sep 2020 12:15PM