సొసైటీలోని తెలంగాణ, ఏపీ ఉద్యోగుల వివరాలివ్వండి: హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులుగా విభజన జరిగిన నేపథ్యంలో పరస్పర సహకార హౌసింగ్ సొసైటీలో సభ్యులుగా ఉన్న ఏపీ హైకోర్టు ఉద్యోగుల జాబితా అందజేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ఎంతమంది సొసైటీలో సభ్యులుగా ఉన్నారో, రిటైర్డ్ అయినవారు, ఇతర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డిల ధర్మాసనం జనవరి 23 (గురువారం)నఉత్తర్వులు జారీ చేసింది. సొసైటీ కార్యదర్శి వినోద్‌కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Published date : 24 Jan 2020 01:39PM