శని, ఆదివారాల్లోనూ ఆఫీసులకి రండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సెలవు దినాలు అయినప్పటికీ శని, ఆదివారాల్లో ఆఫీసులకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది.
సబ్‌రిజిస్ట్రార్లతో పాటు సిబ్బంది ఈ రెండు రోజులూ కార్యాలయాలకు హాజరవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి ఉత్తర్వులు జారీ చేశారు. పాత పద్ధతిలోనే (కార్డ్) రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నప్పటికీ ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, పీటీఐ నెంబర్ లాంటి అంశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, సోమవారం నుంచి సజావుగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేందుకే సిబ్బందిని కార్యాలయాలకు రావాలని ఆదేశించినట్టు సమాచారం.
Published date : 12 Dec 2020 03:34PM