Skip to main content

సంఘజీవి కాదు... త్యాగజీవివి కావాలి!

విద్యార్థి, ఉపాధ్యాయుడు, వైద్యుడు, వ్యాపారి...అందరూ సమాజంలో భాగమే. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా జీవన చక్రం సరిగా నడవదు.
ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సైనికుడిని ఈ సందర్భంలో ఓ ఉదాహరణగా చెప్పుకుందాం. సైన్యంలో చేరాడునుకుందాం. యుద్ధానికి వెళ్లినపుడు ఏమి చేస్తాడు. వెనకాముందు ఆలోచించకుండా శత్రుసైన్యంతో తలపడతాడు. అంతేతప్ప యుద్ధంలో చనిపోతానేమో. అలా జరిగితే నా కుటుంబం ఏమైపోతుందో?.పిల్లల సంగతేమిటి? తదితరాలేవీ ఆలోచించడు. అలా ఆలోచిస్తే యుద్ధం చేయలేడు. ఇంకా చెప్పాలంటే అసలు సైన్యంలోనే చేరడు. ఇది కేవలం సైనికులకే వర్తించదు. సమాజంలోని అన్నివర్గాల వారికీ వర్తిస్తుంది. యుద్ధరంగం లో దిగడానికి వెనకాడకపోవడంద్వారా దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసేందుకు సైతం సిద్ధపడతాడు. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ.. భాగస్వాములే. అయినందువల్ల త్యాగభావం పెంపొందించుకోవాలి. అది వికాసానికి తోడ్పడుతుంది. మరికొందరికి సన్మార్గం చూపినట్టవుతుంది.

సన్మార్గమే శ్రేయోమార్గం
ప్రస్తుతం సమాజంలో అనేకమంది కోటీశ్వరులున్నా వారికంటే మధ్య, దిగువ తరగతి కుటుంబాలకు చెందినవారే సేవామార్గంలో పయనిస్తున్నారు. తమ కుటుంబం గడవడానికే ఇబ్బందులు ఎదురవుతున్నా త్యాగభావంతో పదుగురి మేలు కోరి అనేక రకాల సేవలు అందిస్తున్నారు. న శ్రేయో నియమం వినా... అంటే జీవితానికి నియమాలు, నిబంధనలు లేకపోతే లాభం లేదు. అందరూ సంతోషంగా ఉంటేనే మనం కూడా చక్కగా జీవితాన్ని గడపగలుగుతామని, కొందరే ఆనందంగా ఉంటే అది ఏదో ఒకనాడు ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.
Published date : 02 Jan 2020 03:00PM

Photo Stories