సమాచార కమిషనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఖాళీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టులు రెండింటిని భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీపీఎం అండ్ ఏఆర్) కె.ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తులను ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటలలోగా వ్యక్తిగతంగా గానీ.. రిజిస్టర్ పోస్టులో గానీ పంపించాలని సూచించారు. సెక్రటరీ, ఏపీఐసీ, మొదటి అంతస్తు, ఎంజీఎం క్యాపిటల్ వద్ద, ఎన్‌ఆర్‌ఐ వై జంక్షన్, చినకాకాని గ్రామం, మంగళగిరి–522508, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు చేరేలాగా రిజిస్టర్ పోస్టు పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు 8639376125 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Published date : 10 Apr 2021 05:19PM