Skip to main content

స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ..ఈ సబ్జెక్ట్‌ను తప్పనిసరి బోధించాలి : సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: స్కూళ్లలో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను ఉంచాలని, టీచర్ల అనుభవం, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖపై ఆగ‌స్టు 4వ తేదీన‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్ల వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలని, విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలని అధికారులను ఆదేశించారు. టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడంపై తయారుచేసిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

నూతన విద్యావిధానం స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరణ :
▶ శాటిలైట్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2)
▶ ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ-1, పీపీ-2. 1, 2)
▶ ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ ( పీపీ–1 నుంచి 5వ వరగతి వరకూ)
▶ ప్రీ హైస్కూల్స్‌ ( 3 నుంచి 7లేదా 8వ తరగతి వరకూ)
▶ హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకూ)
▶ హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ) వర్గీకరించామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ వర్గీకరణ వల్ల సుమారుగా ఇప్పుడున్న స్కూల్స్‌ 44వేల నుంచి సుమారు 58వేల స్కూల్స్‌ అవుతాయని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు.
Published date : 04 Aug 2021 06:04PM

Photo Stories