స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు..ఈ పరీక్షలను కూడా రద్దు..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జూన్ 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది.
ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం.. కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇచ్చింది. జూన్ 19 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే.
ఈ పరీక్షలను కూడా రద్దు..
ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Published date : 10 Jun 2021 05:27PM