Skip to main content

స్కూల్‌ విద్యార్ధులకు ఫిట్‌ ఇండియా క్విజ్‌–2021.. రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి..

లబ్బీపేట (విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఫిట్‌ ఇండియా క్విజ్‌–2021 నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య కమిషనర్‌ చినవీరభద్రుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి జి.భానుమూర్తి ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
8వ తరగతి, ఆపై తరగతులు చదివేవారు క్విజ్‌లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. పాఠశాలలు, యూత్‌క్లబ్స్, వ్యక్తిగతంగా, సమూహంగా పాల్గొనవచ్చన్నారు. జూలై 1 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్స్‌ ఉంటాయని తెలిపారు. పాఠశాల స్థాయి, ప్రాథమిక స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి.. ఇలా నాలుగు రౌండ్లుగా క్విజ్‌ ఉంటుందని, విజేతలకు నగదు బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. fitindia.gov.in లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్ట్రేçషన్‌ ఫీజు ప్రతి విద్యార్థికి రూ.250గా నిర్ణయించామన్నారు.
Published date : 24 Jun 2021 04:46PM

Photo Stories